IND vs PAK T20: భారత్ వర్సెస్ పాక్ హెడ్‌ టూ హెడ్ రికార్డులు

T20 World Cup: India vs Pakistan Head to Head Record

T20 World Cup: India vs Pakistan Head to Head Record

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్ హై వోల్టేజ్ మ్యాచ్‌ లో భాగంగా నేడు దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇదే మ్యాచుతో టీ20 ప్రపంచ కప్‌లో తమ ప్రయాణాలను మొదలుపెట్టనున్నాయి. రెండు జట్లలోనూ ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.

ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ మూడో ర్యాంకులో ఉంది. మొదటి స్థానం ఇంగ్లండ్‌ది. బంతి, బంతిని ఉత్కంఠగా వీక్షించే ప్రేక్షకులకు ఈ మ్యాచ్ మరింత హైఓల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది
అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ అత్యధిక విజయాలతో నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లో భారత్ ఓడిపోలేదు. అలాగే భారత్ ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లో విజయం సాధించింది. అలాగే పాకిస్తాన్ మాత్రం ఒక మ్యాచులో విజయం సాధించి, మరో మ్యాచులో ఓడిపోయింది. టీ 20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. గత ఐదు మ్యాచుల్లో భారత్ 4, పాకిస్తాన్ 1 మ్యాచుల్లో విజయం సాధించాయి. మొత్తంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో భారత్ 7 , పాకిస్తాన్ 1 మ్యాచులో విజయం సాధించాయి.

2007 లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ పాక్ తోనే ఆడింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీసేన, నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 141 రన్స్ చేసింది. ఆ తర్వాత పాక్ కూడా ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 141 పరుగులే చేయగలిగింది. దీంతో, ఫలితాన్ని బౌలౌట్ పద్దతి ద్వారా తేల్చగా అందులో టీమిండియా 3-0 తేడాతో పాక్ పై విజయం సాధించింది.

అదే ఏడాది 2007 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా భారత్-పాక్ మరోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ తర్వాత 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 152 పరుగులకే ఆలౌటైంది.
2012 వరల్డ్ కప్ లో సూపర్-8 లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ముందు పాక్‌ను 128 పరుగులకే టీమిండియా ఆలౌట్ చేసింది. అదే మ్యాచ్ లో తరువాత కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 61 బంతుల్లో 78 పరుగులు చేసి ఒంటి చేత్తో విరాట్ కోహ్లీ విజయాన్నందించాడు.

2014 వరల్డ్ కప్ లో ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండగా.. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను 130/7 స్కోరుకే పరిమితం చేశారు ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించడంతో టీమిండియా 48.3 ఓవర్లలో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు.

2016 వరల్డ్ కప్ లో భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇరు దేశాలు ఒకే గ్రూప్‌లో తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 118/5 స్కోరుకే భారత్‌ కట్టడి చేసింది. ఆ తర్వాత టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.

పిచ్, వాతావరణం
ఐపీఎల్‌ తర్వాత దుబాయ్‌ పిచ్‌లు నెమ్మదించాయి. స్పిన్‌ బౌలర్లు ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. పేసర్లు కూడా స్లో బంతులతోనే ఫలితం రాబట్టగలరు. రాత్రి మంచు ప్రభావం ఎక్కువ కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, షమీ, బుమ్రా, రాహుల్‌ చహర్‌/అశ్విన్.

పాకిస్తాన్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ఆసిఫ్, ఫఖర్‌ జమాన్, హైదర్, మొహమ్మద్‌ రిజ్వాన్, ఇమాద్‌ వసీమ్, మొహమ్మద్‌ హఫీజ్‌/షోయబ్‌ మాలిక్, షాదాబ్‌ ఖాన్, హరీస్‌ రవూఫ్, హసన్‌ అలీ, షాహిన్‌ షా అఫ్రిది.