టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్‌ రిలీజ్.. యానిమేషన్‌ క్యారెక్టర్లతో అదిరిపోయింది.. వీడియో వైరల్ - TNews Telugu

టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్‌ రిలీజ్.. యానిమేషన్‌ క్యారెక్టర్లతో అదిరిపోయింది.. వీడియో వైరల్అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌ క్రీడాభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమైపోయింది. భారత్‌ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో 16 జట్లు పోటీ పడనున్నాయి.

ఈ క్రమంలో ప్రపంచకప్‌ పోటీలకు సంబంధించి ‘లివ్‌ ద గేమ్‌.. లవ్‌ ద గేమ్’ థీమ్‌తో ఐసీసీ స్పెషల్ సాంగ్ ని రూపొందించింది. యానిమేషన్‌ క్యారెక్టర్లతో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది కంపోజ్‌ చేసిన థీమ్‌ సాంగ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ స్పెషల్ సాంగ్ లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పొలార్డ్‌, రషీద్ ఖాన్‌, గ్లెన్‌ మాక్స్ వెల్‌ యానిమేషన్‌ క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి. వరల్డ్‌ కప్‌లో పాల్గొనే టీంల జెర్సీలు, జాతీయ జెండాలను చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినసొంపైన మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది.