T20 World Cup 2021: రషీద్‌ దెబ్బకు విండీస్‌ విలవిల.. 56 పరుగులకే ఆలౌట్

Windies worth Rashid's blow

Windies worth Rashid's blow

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ టీం చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 55 పరుగులకే ఆలౌటైంది.

క్రిస్‌ గేల్‌ (13) ఒక్కడే రెండంకెల స్కోరును సాధించగా.. సిమన్స్ 3, లూయిస్ 6, హెట్‌మెయిర్‌ 9, డ్వాన్ బ్రావో 5, నికోలస్ పూరన్ 1, కీరన్‌ పొలార్డ్‌ 6, రస్సెల్‌ డకౌట్, హోసెన్ 6*, మెక్‌కీ డకౌట్‌, రవిరాంపాల్‌ 2 ఇలావచ్చి అలా వెళ్లారు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ అదిల్ రషీద్‌ (4/2) పడగొట్టగా.. మిల్స్‌ 2, మొయిన్ అలీ 2, వోక్స్, జొర్డాన్ చెరో వికెట్ తీశారు.