టీ20 ప్రపంచకప్ 2021 వార్మప్ మ్యాచ్.. భారత్‌ ముందు 189 పరుగుల లక్ష్యం

టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా బౌలింగ్‌ ఎంచుకుంది.

ఇంగ్లాండ్‌ బ్యాటర్లలలో జానీ బెయిర్‌ స్టో (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన మొయిన్‌ అలీ (43) ధాటిగా ఆడాడు. లియామ్‌ లివింగ్‌ స్టోన్ (30) రాణించాడు. జేసన్‌ రాయ్‌ (17), జోస్ బట్లర్‌ (18), డేవిడ్‌ మలన్ (18) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి మూడు, రాహుల్‌ చాహర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్‌ తీశారు.