టీ20 ప్రపంచకప్‌-2021 వార్మప్‌ మ్యాచ్‌.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకున్న ఇండియా

Teamindia won the toss and elected to field

Teamindia won the toss and elected to field

టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఇవాళ భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

అక్టోబర్‌ 23 నుంచి ప్రారంభంకానున్న సూపర్ 12 స్టేజ్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఇండియా ఈనెల 20న ఆస్ట్రేలియాతో మరో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

సూపర్ 12 లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా 23న ఇంగ్లండ్‌.. విండీస్‌తో తలపడనుండగా, 24న ఇండియా.. పాక్‌ను ఢీకొట్టనుంది.