ఆన్‌లైన్‌లో బంగారం కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే..

ఇప్పుడు ఏం కొనాలన్నా.. షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అంతా ఆన్‌లైన్‌. ఆర్డర్ చేస్తే చాలు మనకు కావాల్సిన వస్తువు ఇంటికొచ్చేస్తుంది. అయితే.. ఆన్ లైన్ షాపింగ్ వల్ల లాభాలున్నట్టే.. నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే.. ఆన్ లైన్ లో బంగారం కొనేవారికి ఆర్థిక నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవి మీకోసం..

బంగారమంటే.. భారతీయులకు ఆభరణాలు, ఆస్తి మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా. పెండ్లి, పుట్టినరోజులతో పాటు ఇతర శుభకార్యాలకు బంగారం కొనడాన్ని ఓ వేడుకలా భావిస్తారు. పండుగలు, ఇతర పర్వదినాల్లో బంగారం కొంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ, ధన త్రయోదశి (దంతేరస్) లాంటి సందర్భాల్లో నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ-కామర్స్ పెరిగిపోవడం వల్ల ఆన్‌లైన్ షాపింగ్‌ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌లోనే బంగారు ఆభరణాల అమ్మకాలు కూడా కరోనా కారణంగా బాగానే పెరిగిపోయింది. బంగారు నగలతో పాటు.. 24 క్యారట్ల గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కూడా ఈ-కామర్స్ సైట్లల్లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు… నగల వ్యాపారులు కూడా ఆన్‌లైన్‌లో పెట్టి బంగారు నగల్ని అమ్ముతున్నారు. అయితే బంగారు నగల్ని ఆన్‌లైన్‌లో కొనడం లాభమా? లేకపోతే నష్టమా? ఆన్‌లైన్‌లో నగలు కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆన్ లైన్ లో కొంటే లాభాలివే…
ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనడం వల్ల చాలా లాభాలున్నాయి. అయితే.. అప్రమత్తంగా లేకపోతే భారీగా నష్టపోక తప్పదు. బంగారు ఆభరణాలపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నగలు కొనడం మంచిది. షాపులో కన్నా ఆన్‌లైన్‌లో కొంటే చాలా వెరైటీలు చూడొచ్చు. మీకు నచ్చిన డిజైన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బంగారు ఆభరణాలు కొంటే పేమెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌ మాత్రమే కాదు నెట్ బ్యాంకింగ్, ఈ-వ్యాలెట్ల ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. రిటర్న్, రీప్లేస్ కూడా ఉంటుంది. అంటే మీరు ఆర్డర్ చేసిన నగలు మీ చేతికి వచ్చాక నచ్చకపోతే వాటిని మార్చుకోవచ్చు. లేదా రిటర్న్ చేయొచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. ధంతేరస్, అక్షయ తృతీయ లాంటి పర్వదినాల్లో డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్స్ ఉపయోగించుకోవచ్చు.

 

 

 

 

నష్టాలివే…

  • ఆన్‌లైన్‌లో నగలు కొనడం వల్ల లాభాలున్నట్టే.. నష్టాలు కూడా ఉన్నాయి.
  • ఆన్‌లైన్‌లో నగల్ని ఫోటోల్లో చూసి కొనాలి తప్ప ప్రత్యక్షంగా చూడలేరు.
  • తీరా ఆర్డర్ చేశాక మీరు అనుకున్నట్టు నగలు లేకపోతే నిరాశ చెందాల్సి వస్తుంది.
  • బేరం ఆడటానికి ఛాన్స్ ఉండదు. ఫిక్స్ డ్ రేటుతో ఉంటుంది.
  • షాపులో అయితే నగల్ని ముట్టుకొని , వాటి నాణ్యత, డిజైన్ దగ్గరగా పరిశీలించవచ్చు.
    ఆన్ లైన్ లో ఆ సౌకర్యం ఉండదు. జస్ట్.. ఫొటోలు చూసి కొనుగోలు చేయాల్సి వస్తుంది.
    ఫోటోల్లో చూసి కొనడానికి, ప్రత్యక్షంగా నగలు చూడటానికి చాలా తేడా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో నగలు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. షాపింగ్ చేసే వెబ్ సైట్ విశ్వసనీయతను చెక్ చేయాలి. మార్కెట్లో నకిలీ వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. అచ్చం ఒరిజినల్ వెబ్ సైట్ లాగే ఉంటాయి. అదే నిజం అనకుని నమ్మి వాటిలో కొంటే.. నకిలీల మోసాలకు బలికాక తప్పదు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లను పోలిన ఈ కామర్స్ సైట్లలాగే ఇంటర్నెట్ లో నకిలీ సైట్లు అనేకం ఉన్నాయి. అయితే.. ఏం కొనుగోలు చేసినా అధికారిక వెబ్ సైట్ లోనే చేయాలి. ఆర్డర్ చేసే ముందు బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి. ఫొటో చూసి ఆర్డర్ ఇవ్వకుండా, డిస్క్రిప్షన్ లో ఉన్న వివరాలను స్కి్ చేయకుండా చదువాలి. హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మేకింగ్ ఛార్జీలు ఎంత వేశార కూడా చూడాలి. నగలు నచ్చగానే ఆర్డర్ చేయకుండా రిటర్న్ పాలసీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆన్ లైన్ మార్కెట్లలో కొన్ని వస్తువులకు రిటర్న్, రీప్లేస్ ఆప్షన్ ఉండదు. ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ చేయలేరు. అందుకే రిటర్న్ ఆప్షన్ ఉన్న నగలనే ఎంచుకోవాలి.