పవన్‌ ‘భీమ్లానాయక్‌’పై తమన్‌ ఆసక్తికర కామెంట్స్‌

bhimla-nayak

పవన్‌కల్యాణ్‌-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’పై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్‌ మాట్లాడారు. ‘భీమ్లానాయక్‌’ చూసినట్లు తెలిపారు. త్రివిక్రమ్‌తో కలిసి ఇటీవల ‘భీమ్లానాయక్‌’ రషెస్‌ చూశాను. ఆ సినిమాలో పవన్‌కల్యాణ్‌ యాక్షన్‌ నాకు బాగా నచ్చింది. పవన్‌ కెరీర్‌లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమా కోసం నా వరకూ నేను ది బెస్ట్‌ మ్యూజిక్‌ అందించడానికి ప్రయత్నించానని తమన్‌ చెప్పుకొచ్చాడు.

‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమాకు రీమేక్‌గా  ‘భీమ్లానాయక్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే అందించారు. నిత్యామేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.