పెండ్లికెళ్లి వధూవరులకు పెట్రోల్ గిఫ్టుగా ఇచ్చాడు.. ఎవరో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు

tamil comedian gifted petrol can to newly married couple
tamil comedian gifted petrol can to newly married couple

పెండ్లికి పోతే ఎవరైనా ఏం చేస్తరు? పెండ్లి పిల్ల పేరు మీదనో.. పెండ్లి పిలగాని పేరు మీదనో కట్నం సదివిస్తరు. లేదంటే.. ఏదైనా గిఫ్టు ఇచ్చి ఓ ఫొటో దిగుతరు. వాళ్లు పెట్టిన పెండ్లి భోజనం తిని.. పిల్ల పిలగాన్ని దీవించి వస్తరు. కానీ.. తమిళనాడులో టాప్ కమెడియన్ ఏం చేశిండో తెలుసా? వధూవరులకు ఐదు లీటర్ల పెట్రోల్ గిఫ్టుగా ఇచ్చి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అప్పుడు ఉల్లి ధరలు పెరిగినప్పుడు చాలామంది పెండ్లి కానుకగా ఉల్లిగడ్డలు, దండలు పంపి నవ్వించారు. అయితే.. ఇప్పుడు తాజాగా పెట్రోల్ రేట్లు పెరగడంతో నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్టుగా ఇచ్చాడు.

tamil comedian gifted petrol can to newly married couple
tamil comedian gifted petrol tin to newly married couple

ఇంతకీ ఆ పెట్రోల్ గిఫ్టుగా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కమెడియన్ మయిల్ సామి. ఎన్నో సినిమాల్లో తమిళ ప్రేక్షకులను నవ్వించిన ఆయన అప్పుడప్పుడు రియల్ లైఫ్ లో కూడా సామాజిక సమస్యల మీద ఇలా స్పందిస్తూ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాడు. పెరిగిన పెట్రోల్ ధరల పట్ల తన నిరసణ వ్యక్తం చేయడం కోసమే పెండ్లిలో పెట్రోల్ కానుకగా ఇచ్చానని చెప్పాడాయన. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 తగ్గించి ప్రజలకు అందిస్తోందని.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. గతంలో విరుగమ్ బక్కమ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోియ ఆయన మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితలకు వీరాభిమాని.