భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కారణమిదే అంటున్న మార్కెట్ నిపుణులు

Tarsons Products shares make a strong debut despite weak broader markets

 

దేశంలో మళ్లీ కరోనా వ్యాపిస్తోందన్న వార్తలు భారత్ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. బాంబే స్టాక్ మార్కెట్ BSE, నిప్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 14 వందల పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయ్యింది. కరోనా భయాలకు తోడు ఆసియా మార్కెట్ల పతనం, పడిపోతున్న చమురు నిల్వల వంటి కారణాలు స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

గురువారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు అంతర్జాతీయ బలహీనతల నడుమ సెన్సెక్స్​ 826 పాయింట్లు నష్టపోయి 57,968కి పడిపోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 253 కోల్పోయి 17,282 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 374 పాయింట్ల నష్టంతో 17,162 వద్ద కొనసాగుతోంది. సిప్ల, డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్‎జీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెనెస్క్ 30లో డాక్టర్ రెడ్డీస్ తప్ప అన్ని కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, స్టేట్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి