మోడీ జమానాలో ‘పన్ను వసూళ్ల’ విపత్తు.. పెట్రోల్ ధరలపై మండిపడ్డ రాహుల్‌

Prime Minister's 'nautanki' is the reason behind the second wave of COVID19 in India: Congress MP Rahul Gandhi

మోడీ సర్కారు హయాంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంపై ఆయన మోడీ సర్కారుపై మండి పడ్డారు.

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దాటగా.. డీజిల్‌ రేటు సైతం రూ.100కు చేరువైంది. ఈ క్రమంలో రాహుల్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

‘చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్‌ ప్రారంభమైంది.  పెట్రోల్‌ పంపు వద్ద బిల్లు చెల్లించేటప్పుడు.. మోడీ సర్కారు పెంచిన ద్రవ్యోల్బణం వికాసాన్ని చూస్తారు.’ అని రాహుల్ ట్వీట్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది.