ప్రచారం మధ్యలో టీ బ్రేక్.. టీ టైప్ కేఫ్ లో ప్రజలతో ముచ్చటపెట్టిన మంత్రి హరీష్ రావు - TNews Telugu

ప్రచారం మధ్యలో టీ బ్రేక్.. టీ టైప్ కేఫ్ లో ప్రజలతో ముచ్చటపెట్టిన మంత్రి హరీష్ రావు‘Tea top’ tea break in Minister Harish Rao election campaign

హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మంత్రి హరీష్ రావు.. ఇవాళ జమ్మికుంటలో కాసేపు ఆగి అక్కడి ‘టీ టైప్’ లో టీ తాగారు. ఈ సందర్భంగా అక్కడ సందడి చోటు చేసుకుంది. హరీష్ రావు అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, ప్రజలు పోటీ పడ్డారు. అందరినీ పలకరిస్తూ.. వారితో సెల్ఫీలు దిగిన హరీష్ రావు ఉత్సాహంగా ప్రజలకు అభివాదం చేశారు. హరీష్ రావు వెంట కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా  టీ టైప్ యాజమాని ‘‘ఒక నాలుగు రోజుల్లో మా టీ టైప్ కి వస్తారు అనుకున్న సర్.. మిమ్మల్ని పిలవాలని చాలా ఉండే సర్.. మేము మీ అభిమానులం సర్’’ అంటై తెగ సంతోష పడ్డాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఒక వృద్ధుడు ‘‘నేను చాయ్ ఇస్తా. మీరు త్రాగాలి’ అని చాయ్ ఇచ్చాడు. అతడు ఇచ్చిన చాయ్ తీసుకొని తాగిన హరీష్ రావు.. జమ్మికుంట ప్రజల ఆదరణ చూసి మంత్ర ముగ్దుడయ్యాడు.