ముగిసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌

Rishabh-Pant

సౌతాఫ్రికాతో జరుగుతున్న  నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా 67.3 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (100 నాటౌట్‌) శతకంతో రాణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(29), కేఎల్ రాహుల్(10), పుజారా(9), మయాంక్(7), అశ్విన్(7), రహానే(1) నిరాశపరిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు తీశారు.