కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్ల‌ను గుర్తించే టెక్నిక్స్

ఎండాకాలంలో మామిడి పండ్ల‌కు ఫుల్ డిమాండ్. ఈ కాలంలో వచ్చే అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం నిషేధించినా ఇంకా అనేక మంది వ్యాపారులు కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌నే అమ్ముతున్నారు. వీటిని తింటే పలు అనారోగ్య స‌మ‌స్య‌లు వచ్చే ప్రమాదం ఉంది. కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌ను మ‌నం సుల‌భంగానే గుర్తించ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

– కార్బైడ్ ఉప‌యోగించి పండించిన పండ్ల‌ను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. అదే స‌హ‌జంగా పండించిన‌ పండ్ల‌యితే నీటిలో మునుగుతాయి.

– స‌హజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్త‌గా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమ‌ల ద‌గ్గ‌ర మంచి వాస‌న వ‌స్తుంది.

– కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌పై అక్క‌డ‌క్క‌డా ఆకుప‌చ్చ స్పాట్స్ కన్పిస్తాయి.

– స‌హ‌జంగా పండిన మామిడి పండ్లయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో అవి ఉంటాయి.

– మామిడి పండ్లు లోప‌ల అక్క‌డ‌క్క‌డా పులుపు తగిలితే కచ్చితంగా వాటిని కార్బైడ్ ఉప‌యోగించి పండించారని అర్థం.

– స‌హ‌జంగా పండిన పండ్ల‌లో ర‌సం ఎక్కువ‌గా వస్తుంది. దాంతోపాటు రుచి కూడా తియ్య‌గా ఉంటాయి.