కామన్వెల్త్‌ గేమ్స్: హైజంప్‌లో భారత్ కు తొలి మెడల్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డుల్లో నిలిచాడు.

బుధవారం రాత్రి జరిగిన హైజంప్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్‌ కెర్‌ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్‌ స్టార్క్‌ సిల్వర్‌ సాధించాడు.