జూలై 3న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Telangana Bangaru Bonam

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. కమిటీ సభ్యులు నిన్న(బుధవారం) విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై చర్చించారు.

కార్యక్రమ వివరాలను ఆలయ ఈవో, ఇంజనీరింగ్‌ అధికారులకు వివరించారు కమిటీ సభ్యులు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.