కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఇక్కడి నేతల్లో కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెలింగ్ ఇలా ఒక హాలిడే ట్రిప్ లా సాగిన రాహుల్ తెలంగాణ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయినా.. కొత్త జోష్ వచ్చిందంటూ కొందరు దుష్ప్రచారం చేసుకుంటున్నా.. సీనియర్స్ మదిలో మాత్రం రాహుల్ వ్యాఖ్యలు తీవ్రంగా గుచ్చుకున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పార్టీలో వర్గపోరుకి దారి తీస్తున్నాయి. పదే పదే అవమానిస్తున్నా.. రాహుల్, సోనియా కోసం సీనియర్స్ ఓపిక పడుతున్నారు. అయినా ఇవేవి పట్టించుకోకుండా మొన్నటి సభలో సీనియర్స్ ని అవమానించేలా రాహుల్ వ్యాఖ్యానించాడని కాంగ్రెస్ కార్యకర్తలు తెగ బాధ పడుతున్నారట. కోవర్టులంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కొందరు సీనియర్లు కూడా మధనపడుతున్నారు. రాహుల్ గాంధీ ఇలా మాట్లాడితే పార్టీలో భవిష్యత్ ఏంటని నేతలు బెంగపెట్టుకున్నారట.
ముఖ్యంగా బహిరంగ సభలో కోవర్టులంటూ రాహుల్ వ్యాఖ్యలు చేయటం.. దాంతో రేవంత్ పెయిడ్ బ్యాచ్ జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటూ కేకలు వేయడంతో రగడ అంతకంతకూ పెరుగుతోంది. ఇలా ముందు వెనుక ఆలోచించకుండా రేవంత్ రాసిచ్చినట్టు ఉన్న స్పీచ్ ని రాహుల్ గాంధీ చదివితే ఎలా అన్న చర్చ మొదలైంది. దీంతో ప్రిన్స్ రాహుల్ తీరుపై అగ్రనేత జానారెడ్డి కూడా గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీని నమ్ముకుని అహర్నిశలు కష్టపడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టికి…రాహుల్ పరోక్ష హెచ్చరికలు చేయటం.. అదే సమయంలో చంద్రబాబు డబ్బులతో పీసీసీ చీఫ్ పదవి కొనుకున్న రేవంత్ ఆగడాలపై గళం విప్పుతున్న వీహెచ్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ విషయంలోనూ రాహుల్ అవమానకర వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. మునుముందు పార్టీకి రాహుల్ వ్యాఖ్యలు తీరని నష్టం కలుగచేస్తాయని బయట ఎవరికి చెప్పుకోలేక లోలోపలే నేతలు వేదన పడుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయ్.