తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,660 కేసులు - TNews Telugu

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,660 కేసులుతెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది.

తాజాగా కరోనాతో 23 ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది. ఇవాళ 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.