తెలంగాణ కరోనా అప్డేట్.. 40 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు - TNews Telugu

తెలంగాణ కరోనా అప్డేట్.. 40 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులుతెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,242 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19 మంది మరణించినట్లు వైద్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 5,53,277కి చేరాయి. కరోనా నుంచి 5,09,663 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రంలో 40,489 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 3,125 మంది మృతి చెందారు.