తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పదో తరగతి పరీక్షలు రద్దు

Telangana government has taken a key decision , SSC Exams Cancelled And Inter Exams Postponed

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను కూడా ర‌ద్దు చేసింది. ఇదే స‌మ‌యంలో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ  స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రామచంద్రన్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.   రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది టెన్త్‌ విద్యార్థులు ఉన్నారు. కాగా, వీరందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంట‌ర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు.

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసిన రాష్ట్ర విద్యాశాఖ సెకండియర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి 15 రోజుల ముందే విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పింది.  బ్యాక్ లాగ్ ఉన్న సబ్జెక్టులో విద్యార్థులకు మినిమం మార్కులు ఇవ్వడం జరుగుతుందని తెలిపింది.  ఈ ఏడాది నిర్వహించబోయే ఎంసెట్ పరీక్షల్లో ఇంటర్మీడియట్ 25 శాతం మార్కుల వెయిటేజీ ఉండదని తేల్చి చెప్పింది.

ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో, పరీక్షల నిర్వహ‌ణ‌పై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

.