కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రెండోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా హుజూరాబాద్‌లోని ప్రాంతీయ దవాఖానలో ఆయన కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి లేదని మంత్రి తెలిపారు. 60 ఏండ్లు పైబడిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కూడా టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న దవాఖానల్లో టీకా వేయించుకోవాలని కోరారు.

టీకా వేసుకున్న ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్

రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ లో భాగంగా 60 ఏండ్లు పైబడివారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలు వేస్తారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది వరకు ఉండొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. తొలిరోజు 90 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా పంపిణీ చేస్తారు. కొవిడ్ టీకా కోసం cowin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.