100% వాక్సినేషన్ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలి

Minister-Harish-Rao

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు తెలంగాణను 100% కోవిడ్ వాక్సినేషన్ జరిగిన రాష్టంగా తీర్చిదిద్దుటకు హ్యాబిటేషన్స్, గ్రామాలు, మండలాల వారిగా లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. శనివారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, DMHO లు, DCH లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

85% మంది మొదటి డోస్

100% వాక్సినేషన్ తోనే కోవిడ్ ప్రభావం నుంచి పూర్తిగా భద్రత పొందగలుగుతామన్నారు. వారం వారం సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని స్పష్టం చేశారు. రాష్టంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రజలు 2 కోట్ల 77 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు  రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 43 లక్షల వాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. అందులో 2 కోట్ల 35 లక్షల మందికి మొదటి డోస్ ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా 1 కోటి 8 లక్షల మందికి రెండవ డోస్ ఇచ్చామన్నారు. అర్హత కలిగిన  18.66 లక్షల మంది రెండవ డోస్ వేసుకొనేందుకు కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. రాష్టంలో అర్హత కలిగినట్లు గుర్తించిన వారిలో 85% మంది మొదటి డోస్ వాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా వాక్సినేషన్ చేయుటకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయుటకు పంచాయతీ రాజ్, ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు.

డిసెంబర్ లోపు పూర్తి చేయాలి

ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీల భవనాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మెడికల్ కాలేజీ లకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యమును పెంచాలన్నారు. అలాగే విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్ బిల్డింగ్స్ ను గుర్తించాలని చెప్పారు.

Harish-Rao-Review-meet-with medical officials

సీఎం కేసీఆర్ చొరవతో మౌలిక వసతులు కల్పన

ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే ఈ వసతులను సక్రమంగా వినియోగించుటకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామక అధికారాలను  జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. ఏ ఆసుపత్రిలో నైనా ఉన్న పరికరాలు పూర్తిగా వాడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఉచితంగా 946 రకాల వైద్యసేవలు

ప్రభుత్వ, ప్రవేటు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ లో ఉచితంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చిన్నట్లు వివరించారు. వైద్యానికి ముఖ్యమంత్రి పెద్ద పీట వేస్తున్నారని, వైద్యానికి మరో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని  సీఎం చెప్పారని హరీస్ అన్నారు.  తెలంగాణ డైయాగ్నోస్టిక్ సెంటర్స్ సేవలను ప్రజలకు అందించాలన్నారు.

డాక్టర్ల పనితీరుపై సమీక్ష

ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రుల సర్ ప్రైజ్ విజిట్స్ ఉంటాయి.  పి హెచ్ సి ల నుండి జిల్లా, మెడికల్ కాలేజీల వరకు తనిఖీ చేయనున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు. జిల్లాల్లో ఉన్న ప్రాధమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా  ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచి ప్రజలు విశ్వాసాన్ని చూరగొనెందుకు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్లు, DMHO లు, DCH లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో పేషెంట్స్ అక్యూపెన్సిని, సర్జరీ లను సమీక్ష చేయాలని, అల్లోపతి వైద్యంతో పాటు ఇతర విభాగాల వైద్యుల పనితీరును సమీక్షించాలన్నారు.

ఆకస్మిక తనిఖీలు

ఆసుపత్రులకు మంజూరైన ఆక్సీజన్ ప్లాంట్ల పనులను పూర్తిచేయించాలని చెప్పారు. శానిటేషన్ పై కూడా శ్రద్ద చూపాలని సూచించారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేశారు. మలేరియా, టి.బి., లెప్రసి, బ్లైండ్ నెస్ నివారణ కార్యక్రమాలును కూడా సమీక్షించాలని తెలిపారు. జిల్లా పర్యటనల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేసి, సమీక్షలు జరుపనున్నట్లు మంత్రి చెప్పారు.

నితీరును మానిటర్ చేయాలి

ఆశా వర్కర్ నుండి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరును మానిటర్ చేయాలని చెప్పారు. ఇకనుంచి పనితీరును బట్టే పోస్టింగ్స్, ప్రొహ్సాహకాలు వుంటాయని తెలిపారు. హాస్పిటల్స్ లో పేషెంట్స్ కు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. జిల్లాల్లో ఉన్న ఆర్. బి. ఎస్. కె. యూనిట్లను యాక్టివేట్ చేయాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెల్త్ సెక్రటరీ SAM రిజ్వి, DPH Dr G. శ్రీనివాసరావు, DME Dr రమేష్ రెడ్డి, OSD Dr గంగాధర్ తదితరులున్నారు.