దేశానికే తెలంగాణ ఆదర్శం-కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారిందని చెప్పారు. యూకే పర్యట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఆయ‌న‌ లండన్‌లోని హై కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. భారత్, బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారులను కోరారు. ఎన్నో ప్రపంచ రంగ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని… దానికి సీఎం కేసీఆర్ విధానాలే కారణమని చెప్పారు. డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొయ్ ఘోష్ , నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు.