సమాజంలో చైతన్యం నింపిన ‘సిరివెన్నెల’ పాటలు.. పలువురి సంతాపం

Sirivennela-Sitaramashastri

మూడున్నర దశాబ్దాల పాటు మూడు వేలకు పైగా పాటలు రాసి తెలుగు సినిమాపాటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు.

వీరితోపాటు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తన పాటల ద్వారా సమాజంలో చైతన్యం  నింపి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.

చలనచిత్ర పరిశ్రమకు ఆయన లేనిలోటు పూడ్చలేనిదని అన్నారు. సిరివెన్నెల మరణం పట్ల మంత్రులు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు.