తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం: కేటీఆర్ - TNews Telugu

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం: కేటీఆర్



అనేక సవాళ్లను ఎదుర్కొని… అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఈ మేరకు తెలంగాణ సాధించుకున్నాము.. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నమని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

25న జరిగే పార్టీ సమావేశం జరిగే హైటెక్స్ ప్రాంగణాన్ని ఇవాళ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. మా పార్టీ విధానాలను పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. ప్రభుత్వం లోకి వచ్చిననాటి నుంచి అపూర్వమైన విధానాలతో… పాలసీలతో దేశానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు దేశ ప్రజలు… భారత ప్రభుత్వానికి సైతం ఆదర్శంగా నిలుస్తుంది మా సర్కార్. మా పథకాలను కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని… వాటిని అనుకరించి… రైతుబంధు లాంటి కార్యక్రమాల స్ఫూర్తితో పీఎం కిసాన్ ను  కేంద్రం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రానికి ఇంటింటికి నల్ల నిళ్ళిచ్చిన మిషన్ భగీరథ కార్యక్రమం మాదిరే కేంద్రం జల్ జీవన్ మిషన్, టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాపోతున్నదన్నారు.

అర్బన్ లంగ్ స్పెస్ ఏర్పాటుచేసిన తెలంగాణ తీరుగానే కేంద్రం కూడా నగర వన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది… అది ఈరోజు తెలంగాణ ఏం చేస్తుందో రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారిందన్నాడు. ఇంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదని చెప్పారు. 25 తేదీన జరిగే పార్టీ సాధారణ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని…ఈ సమావేశం హైటెక్స్ లో జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు… మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తున్నాం. ఈరోజు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సభ ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించాం. సభ నిర్వహణ దానికి సంబంధించిన ఏర్పాట్లను కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున పలు కమిటీలను కేటీఆర్ ప్రకటించారు.

ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్ల కమిటీ, పార్కింగ్, భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, మీడియా కమిటీ, నగర అలంకరణ కమిటీ మొదలైన కమిటీలను కేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తాం. పార్టీ ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.