కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ మరో లేఖ

krmb

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు తెలంగాణ తాజాగా మరోలేఖ రాసింది. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను KRMB గెజిట్ నోటిఫికేషన్ లో రెండు కాంపోనెంట్స్ గా పేర్కొన్నారు. అవి ఒకే కాంపొనెంటు గా మార్పు చెయాలని లేఖలో కోరింది. అలాగే జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లు అన్నింటిని షెడ్యూల్-2 నుండి తొలగించి  షెడ్యూల్-3 లోకి మార్చాలి. ఆ ప్రాజెక్టు, దాని ఆయకట్టు కేవలం తెలంగాణ కు చెందినది. ఆంధ్ర ప్రదేశ్ తొ ఏ విధమైన సంబంధం లేదని లేఖలో ప్రస్తావించింది.

నాటి హైదరాబాదు ప్రభుత్వం 174.3 టిఎంసీలతో మహబూబ్ నగర్ జిల్లాకు మూడు ప్రాజెక్టులు గ్రావిటీ ద్వారా భీమా, తుంగభద్ర ఎడమ కాలువ, అప్పర్ కృష్ణా ప్రాజెక్టులు కట్టాలని ప్రతిపాదించారు. కాని 1956 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కెంద్ర ప్రభుత్వాన్ని అడగనందువల్ల ఈ ప్రాజెక్టులు తెలంగాణ ఆయకట్టు వరకు చేరలేదు. అందువల్ల తరువాతి కాలములొ లిఫ్ట్ స్కీమ్ లు తప్పని పరిస్తితి ఏర్పడిందని లేఖలో గుర్తు చేసింది.

ఆ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి  జురాల ప్రాజెక్టు (స్టేజి-1 గ్రావిటీ 23 టీఎంసీలు, స్టేజి-2 లిఫ్ట్ 28.8 టీఎంసీలు),  1970 లొ నాటి తెలంగాణ  ఉద్యమ తీవ్రత వల్ల నాటి ప్రభుత్వాలు ప్రతిపాదించినా, తరువాత వాటికి మొదటి ప్రాధాన్యత ఈయవద్దని, ఆంధ్ర ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 1973 లో ట్రిబ్యునల్ కు నివేదించారు.

జురాల డ్యాం మొదట ప్రతిపాదించిన ప్రదేశంలో 30 టీఎంసీల సామర్థ్యంతో  కాకుండా ఒక బ్యారేజిగా ఎగువన 11 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు. అయితే నాటి గ్రావిటీ స్కీం బదులుగా భీమా లిఫ్ట్ స్కీమ్ ను జురాలకు ఎడమ కాలువ కింద కొంత మేరకు ఆయకట్టుకు నికర జలాలు ఇచ్చినా, ఎడమ వైపునకు ఏ  విధమైన నికర జలాలు ఇవ్వలేదు. నెట్టెంపాడు లిఫ్ట్ స్కీం నాడు ఎడమ వైపు ఆయకట్టుకై మిగులు జలాల ఆధారంగా చేపట్టినారు. నేడు తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తున్నది, నీటిని ఆయకట్టు అవసరాలకు తగినంతగా కేటాయిస్తున్నదని పేర్కొంది.

తెలంగాణ ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు నికర జలాలను  కెటాయించాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ను తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. కాబట్టి చారిత్రిక అన్యాయాలను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని  కేఆర్ఎంబీని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.