ఆకాశంలో ఎగిరే కార్లు.. ఏంటి వీటి కథ?

రోడ్డుపై నడుస్తూ.. ఆకాశంలో కూడా ఎగిరే కార్లకు ఎప్పుడో ప్లాన్ రూపొందించారు. అయితే వీటికి ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వలేదు. ఎంతోకాలంగా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు ఇప్పుడు అనుమతులు వచ్చేశాయి. పదివేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణించే తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికారిక క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు మంజూరు చేసింది. చైనాకు చెందిన టెర్రాఫుజియా కంపెనీ ట్రాన్సిషన్ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కు విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఉండడంతో వీటికి రీసెంట్ గానే పర్మిషన్స్ ఇచ్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ కారుకి గాలిలో ఎగిరే అనుమతి ఉంది. కానీ రోడ్డుపై నడిచే అనుమతి ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే వచ్చేస్తుందని అధికారులు చెప్తున్నారు.
ఈ ఎగిరే కారుకు రెక్కలు ఉంటాయి. రోడ్డుపై వెళ్తూనే గాళ్లోకి ఎగరగలదు. ఈ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకోవాలనుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు పైలట్ సర్టిఫికెట్ కూడా ఉండాలని చైనీస్ కంపెనీ టెర్రాఫుజియా చెప్పింది.