యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం. చిన్నారి సహా నలుగురు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాండిలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వేగంగా వచ్చిన బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

లక్నో-హర్దోయ్ రహదారిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ఈస్ట్ ఫ్యాక్టరీ సమీపంలో హర్దోయ్ వైపు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు.. లక్నో వైపు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి, ఇద్దరు మహిళలు సహా చిన్నారి మృతి చెందారు.

ఈ ఘటనలో బస్సు సైతం అదుపు తప్పి బోల్తాపడగా.. పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్వాల్‌ భేణిమాధవ్‌ త్రిపాఠి పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.