రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో 19మంది మృతి

మిలటరీ సైన్యమే లక్ష్యంగా పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 19మంది ప్రాణాలు కోల్పోయారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 9 మంది సైనికులు కాగా.. 10మంది సాధారణ పౌరులు. కాల్పులు జరిగిన ప్రదేశంలో సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానాకు తరలించారు. ఇది ఉగ్రవాదుల దాడే అని ఆ దేశ సమాచార శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి ఉస్సేని తంబోరా ధృవీకరించారు.


ఈ నెల 14న కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 19మంది సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు. ఈ ఘటన షాహెల్ రీజిన్ లోని సౌమ్ ప్రావినస్ లో ఈ ఘటన జరిగినట్టు ఆ దేశ రక్షణశాఖ మంత్రి మ్యాక్సిమ్ కోనే రేడియోలో ప్రకటించారు.