వంద కార్లు ఢీ.. ఆ రోడ్డంతా గల్లంతే..

f
texas

యాక్సిడెంట్ జరిగితే ఒకటో రెండో వాహనాలు ఢీ కొట్టుకుంటాయి. కానీ అమెరికాలోని టెక్సాస్ లో ఏకంగా వందల వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొని కిలోమీటర్ పొడవు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతకీ ఏమైందంటే..

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్త్‌విత్‌ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై తీవ్రమైమ మంచు తుఫాన్ రావడంతో రోడ్లన్నీ తడిచిపోయాయి. అయితే అక్కడి రోడ్లు మరింత సున్నితంగా ఉండడంతో ఈ వర్షానికి అక్కడి రోడ్డుపై గ్రిప్ లేకుండా పోయింది. సున్నితమైన రోడ్డు, పైగా తడి.. దీంతో వాహనాలు టైర్లు పట్టుకోల్పోయి ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటూ మొత్తం గందరగోళం అయింది. ముందుగా ఒక పెద్ద కంటెయినర్ లారీ అదుపుతప్పి డివైడర్ కు గుద్దుకుని రోడ్డుకి అడ్డంగా ఆగిపోయింది. దాని వెనుక ఒకదానితర్వాత ఒకటిగా వాహనాలన్నీ ఢీకొట్టుకుంటూ యాక్సిడెంట్ జామ్ అయింది. ప్రమాద జరిగిన ప్లేస్ కు చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, చికిత్స అందిస్తున్నారు.