పోసానీ నువ్వు మాట్లాడింది తప్పు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే ఏంటి.. అదుపులో ఉండాలి కదా.. సీనియర్ నిర్మాత ఆగ్రహం

Thammareddy Bharadwaja Fires On Posani Krishna Murali Comments On Pawan Kalyan
Thammareddy Bharadwaja Fires On Posani Krishna Murali Comments On Pawan Kalyan
Thammareddy Bharadwaja Fires On Posani Krishna Murali Comments On Pawan Kalyan
Thammareddy Bharadwaja Fires On Posani Krishna Murali Comments On Pawan Kalyan

అటు రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళి తీవ్ర దుమారమే రేపాడు. పవన్ కల్యాణ్ గురించి పోసాని మాట్లాడిన మాటలు పద్ధతిగా లేవంటూ మెగా క్యాంపెయిన్ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. దీనికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పోసాని మీద,ర ఆయన ఇంటి మీద దాడులు కూడా చేశారు. అయితే.. పోసాని మాట్లాడిన మాటలపై ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుననారు. ఆయన అభిమానులు నిన్ను బాధ పెట్టి ఉంటే.. నువ్వు అంత దారుణంగా మాట్లాడటం సరి కాదు కదా అంటూ టాలీవుడ్ ప్రముఖులు పోసాని తీరును తప్పు పడుతున్నారు. పోసాని వ్యాఖ్యలపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యాడు.


పవన్ కల్యాణ్ ను విమర్శించే హక్కు నీకుంది. కానీ.. అతడి వ్యక్తిగత జీవితం గురించి మాట్లడటం తప్పు. నువ్వు మాట్లాడిన భాష సరిగ్గా లేదు అంటూ పోసానికి హితవు పలికారు తమ్మారెడ్డి. పవన్ కల్యాణంలో ప్రసంగంలో ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై నోరు జారాల్సిన అవసరం నీకేంటి? అంటూ ప్రశ్నించారాయన. పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యాల గురించి.. ఆయన పార్టీ సిద్ధాంతాలపై విమర్శించి ఉంటే బాగుండేది. వ్యక్తిగత జీవితంపై నువ్వు నోరు జారడం కరెక్ట్ కాదు అంటూ పోసాని కృష్ణమురళికి సూచించారు తమ్మారెడ్డి భరద్వాజ.


గతంలో పవన్ కల్యాణ్ మీద కత్తి మహేష్ నోరు జారిన విషయన్ని కూడా తమ్మారెడ్డి గుర్తు చేశారు. పోసాని పవన్ ను దారుణంగా తిట్టాడు కాబట్టి.. ఆయన అభిమానులు పోసానిని తిడుతున్నారు. దీనికి పోసాని మీడియా ముందుకు వచ్చి పవన్ అభిమానులు నన్ను తిడుతున్నారు అంటూ బాధపడటం ఎందుకు అంటూ ప్రశ్నించాడు. హీరోలను తిడితే.. వాళ్ల ఫ్యాన్స్ సహించలేరు. కాకపోతే పవన్ కల్యాణ్ అభిమానులు హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ఇంత దూకుడు పనికి రాదు అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి సూచించారు తమ్మారెడ్డి భరద్వాజ.