రైతులకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం.. మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao inaugurated the Sangameshwara Lift Irrigation Survey work

Minister Harish Rao inaugurated the Sangameshwara Lift Irrigation Survey work

రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో రూ.3.53 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలసి శంకుస్థాపన చేశారు. తర్వాత మాట్లాడుతూ.. చౌడారం గ్రామానికి డబుల్ లేన్ బ్రిడ్జీ తేవడం సంతోషమన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని.. గ్రామాన్ని దశల వారీగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

రైతు బంధు కింద ఈ వానాకాలం 60 లక్షల 57 వేల 197 మంది రైతులకు రూ. 7178 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు ఎక్కడికీ తిరగకుండా పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కరోనాతో ఇబ్బంది ఏర్పడినా.. ఏం తగ్గినా రైతులకు రైతుబంధు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని మంత్రి అన్నారు.

నెలకు వెయ్యి కోట్ల రూపాయలను నిరంతర నాణ్యమైన విద్యుత్తు కోసం ప్రభుత్వం చెల్లిస్తున్నదని మంత్రి చెప్పారు. 7 ఏండ్ల కింద 24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండితే, ఈ యేడు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. ఇదంతా కాళేశ్వరం జలాలతో సాధ్యమైందన్నారు.

ఆయిల్ ఫామ్, మల్బరీ తోటలు-పట్టు సాగు, వరి వెద సాగు విరివిగా చేపట్టాలని చౌడారం గ్రామ రైతులకు అవగాహన కల్పించి ముందుకు రావాలని రైతులను మంత్రి హరీశ్ కోరారు. నెత్తిమీద కుండలా రంగనాయక సాగర్ ఉన్నదని, పది తరాలు బాగుండాలంటే.. ప్రతీ గ్రామంలో కాల్వలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రి రైతులను కోరారు.