సమీర్‌ వాంఖడే పిటిషన్ ను కొట్టేసిన బాంబే హైకోర్టు

The Bombay High Court struck down Sameer Wankhede's petition

The Bombay High Court struck down Sameer Wankhede's petition

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ డ్రగ్స్  కేసులో ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ చేయకుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే రూ.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిపై విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం నలుగురు ముంబై పోలీస్‌ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ సమీర్‌ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నదని మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఒక వేళ సమీర్‌ వాంఖడేపై ఏదైనా కేసు నమోదై ఆయనను అరెస్టు చేయాల్సి వస్తే.. 72 గంటల ముందుగా నోటీసు ఇస్తామన్నారు. దీంతో సమీర్‌ వాంఖడే పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది.

డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షులైన ప్రభాకర్ సెయిల్, లాయర్లు సుధా ద్వివేది, కనిష్క జైన్, నితిన్ దేశ్‌ముఖ్ లు  సమీర్‌ వాంఖడే ఫిర్యాదులు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని, ఇందులో రూ.8 కోట్లు సమీర్‌ వాంఖడే కోసమని ఆరోపించడం తెలిసిందే.