నిన్న అదృశ్యమైన బాలుడు.. ఇవాళ బొప్పాయి తోటలో శవమై దొరికిండు - TNews Telugu

నిన్న అదృశ్యమైన బాలుడు.. ఇవాళ బొప్పాయి తోటలో శవమై దొరికిండుBoy brutally murdered in Chittoor district
తేజస్ రెడ్డి (8)

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో నిన్న అదృశ్యమైన బాలుడు… ఇవాళ బొప్పాయి తోటలో శవమై కన్పించాడు. దసరా పండక్కి అమ్మమ్మ ఇంటికొచ్చిన మనవడు ఇలా అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించడంతో అమ్మమ్మ ఊరైన కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లిలో విషాదం నెలకొంది.

పీలేరు కు చెందిన నాగిరెడ్డి కుమారుడు తేజస్ రెడ్డి (8) దసరా సెలవుల నేపథ్యంలో అమ్మమ్మ ఊరికి వచ్చాడు. నిన్న గుర్తు తెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేశారు. దీంతో కుటుంబసభ్యులు కె.వి పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారణ చేస్తుండగానే.. ఇవాళ బొప్పాయి తోటలో బాలుడు శవమై కనిపించాడు. తేజస్‌ రెడ్డిని బంధువులే చంపారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.