ఫెన్సింగ్ దాటిన ఆ చిన్నారి.. ఇన్నాళ్లకు తండ్రి చెంతకు.. ఫోటోలు వైరల్

The child who crossed the kabul airport fencing

అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సమయంలో.. తాలిబన్ల నుంచి కనీసం తమ పిల్లలను, ఆడకూతుళ్లను రక్షించుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాలు అప్పట్లో అందరి హృదయాలను కలిచివేశాయి. ఈ క్రమంలో ఓ పసికందును ఫెన్సింగ్‌ దాటించిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.

ఆ తర్వాత ఆ నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ చిన్నారు పేరెంట్స్ గుండెలు చెరువులు అయ్యాయి. ఈ ఘటన గత ఏడాది ఆగస్టు నెలలో జరగగా.. నాలుగు నెలలపాటు నిద్రాహారాలు మానేసి బిడ్డ కోసం వారు తీవ్రంగా వెతికారు.

వివరాల్లోకి  వెళ్లితే.. ఆ చిన్నారి పేరు సోహైల్ అహ్మదీ. అతని తండ్రి మీర్జా అలీ అహ్మదీ (యూఎస్‌ ఎంబసీ సెక్యూరిటీ మాజీ గార్డు). తన భార్య సురయా నలుగురు పిల్లలు వెంటబెట్టుకొని అమెరికా పోవాలనుకున్నాడు. ఆ క్రమంలో ముందుగా తన బిడ్డను ఎయిర్‌పోర్ట్ లోకి చేరవేయాలని.. ఫెన్సింగ్‌ దాటించాడు.

The child who crossed the kabul airport fencing

ఫెన్సింగ్ దాటించిన సైనికులు ఆ చిన్నారి పట్టించుకోలేదు. దీంతో ఎయిర్‌పోర్ట్ లో ఏడుస్తూ కనిపించిన ఆ పసికందును.. ట్యాక్సీ డ్రైవర్‌ హమీద్ సఫీ గుర్తించి తన వెంట తీసుకెళ్లాడు. ఆ గందరగోళ పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వలో అతనికి అర్థం కాలేదు. తనకు పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను అల్లా ఇచ్చిన బిడ్డగా భావించి పెంచుకోవాలని ఇంటికి తీసుకెళ్లాడు.

చిన్నారి కన్పించకుండా పోయిన తర్వాత మూడు నెలలపాటు మీర్జా అలీ అహ్మదీ.. కాబూల్‌లోనే ఉండి కొడుకు కోసం వెతికాడు. ఇంతలో పునరావాసం కింద ఆ కుటుంబం అమెరికాకు వెళ్లింది. చిన్నారిని వెతికే పని ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావికి అప్పగించాడు.

రెడ్‌క్రాస్‌ సాయంతో మొహమ్మద్ ఖాసేమ్.. ఆ చిన్నారిని తీసుకువెళ్లిన టాక్సీ డ్రైవర్‌ సఫీని చేరాడు. కానీ తొలుత సఫీ చిన్నారిని ఇచ్చేందుకు ససేమీరా అన్నాడు. కేసులు పెడతామన్న బెదరని సఫీ.. కన్నప్రేమకు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కరిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూనే.. బాబు సోహైల్‌ను తాత రజావి చేతికి అందించాడు. తాజాగా ఆ చిన్నారి తన తండ్రి మీర్జా అలీ అహ్మదీని చేరిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.