ఆర్యన్‌కు మరోసారి బెయిల్ నిరాకరించిన ప్రత్యేక కోర్టు.. హైకోర్టుకు వెళ్లేందుకు యోచన

shahrukh khan son aryan khan health in trouble
shahrukh khan son aryan khan health in trouble
Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody
Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో మరోసారి చుక్కెదురైంది. ముంబయి ప్రత్యేక కోర్టు మరోసారి ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అతడితో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో ఆర్యన్ తరపు న్యాయవాదులు.. బెయిల్ కోసం బాంబే హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్యన్ కు ఇప్పుడు బెయిల్ ఇస్తే డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని ఎన్‌సీబీ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఆర్యన్ పలుమార్లు పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది.

విచారణలో భాగంగా ఇవాళ ఎన్‌సీబీ.. కోర్టుకు పలు ఆధారాలు సమర్పించింది. ఓ నటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి చాటింగ్, డ్రగ్స్‌ విక్రేతలతో చాటింగ్‌ చేసిన వాట్సాప్‌ చాట్‌లను ఎన్‌సీబీ కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్‌ విక్రేతలకు అతడు రెగ్యులర్ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ కోర్టుకు చెప్పింది.