ముగిసిన తొలి రోజు ఆట.. రాణించిన శుభ్‌మన్‌, శ్రేయస్‌, రవీంద్ర జడేజా

team-india

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలు నమోదు చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.

సీనియర్‌ ప్లేయర్లు పుజారా, రహానెలను త్వరగానే ఔట్‌ అయినా.. అరంగేట్ర బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (75 నాటౌట్‌: 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్ (52: 5 ఫోర్లు, ఒక సిక్స్‌), రవీంద్ర జడేజా (50 నాటౌట్‌: 6 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌ 13, ఛెతేశ్వర్‌ పుజారా 26, అజింక్య రహానె 35 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో జేమీసన్ 3, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.

భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది. అంతకుముందు టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా సారథి అజింక్య రహానె బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.