మూడో రోజు ముగిసిన ఆట.. టీమిండియాదే ఆధిక్యం

axar-patel

న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ (5/62), అశ్విన్‌ (3/82) జడేజా, ఉమేశ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీయడంతో న్యూజిలాండ్‌ కుదేలైంది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 49 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

కివీస్ ఓపెనర్లు టామ్‌ లేథమ్‌ (95), విల్ యంగ్‌ (89) శతకాలు చేసే అవకాశాన్ని బౌలర్లు ఇయ్యలేదు.  అయితే ఆఖర్లో జేమీసన్‌ (75 బంతుల్లో 23) భారత బౌలర్లకు కాసేపు విసుగు తెప్పించినా కివీస్‌కు మాత్రం ఆధిక్యం దక్కేలా చేయలేకపోయాడు.

స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను కివీస్‌ బౌలర్‌ జేమీసన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. జేమీసన్‌కిది 50వ టెస్టు వికెట్‌ కావడం విశేషం. క్రీజ్‌లో మయాంక్‌ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు. భారత్‌ మొదటి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఒక్క రోజే 11 వికెట్లు పడటం గమనార్హం.