నాటి ‘కేసీఆర్ దీక్ష’ చరిత్ర గతినే మార్చింది: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Minister Errabelli Dayakar Rao

నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘తెలంగాణ వచ్చుడో..కేసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో మొదలుపెట్టిన నాటి దీక్ష చరిత్ర గతినే మార్చి వేసిందన్నారు.

రేపటితో దీక్షా దివస్ కు 12 సంవత్సరాలు పూర్తి అవుతున్నా అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను కూడా మరువలేమని మంత్రి అన్నారు.

kcr-diksha

మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన ఆనాటి కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, ఆనాటి కేసీఆర్‌ త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు.

తెలంగాణ సాధించిన కెసీఆర్ సీఎంగా తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తి తో బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ త్యాగ నిరతికి కృతజ్ఞతలు తెలిపారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం మన అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.