రాష్ట్ర వ్యాప్తంగా పెరుగనున్న చలిగాలుల తీవ్రత

winter-in-telangana

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని, కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ. ఎత్తు దగ్గర ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడింది. తాజాగా క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా తూర్పు/అగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నవని, దీని ప్రభావంతో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.