సింహాల‌కే తాను క్వీన్.. వీడియో వైరల్

lions

అడ‌విలో సింహాల త‌ర్వాత‌నే ఇంకే జంతువైనా. సింహానికి ఉన్న ఆ ప‌వ‌ర్ మ‌రే జంతువుకు ఉండ‌దు. వాటిని చూస్తే చాలు.. భ‌యం పుడుతుంది. అవి గ‌ర్జించాయంటే కొన్ని కిలోమీటర్ల వరకు మిగతా జంతువులు భయంతో వణికిపోతాయి.

అటువంటి సింహాల‌తో ఓ మ‌హిళ కలిసి వాక్ చేసింది. సింహాల‌కే తాను క్వీన్ అన్న‌ట్టుగా వాటితో పాటు న‌డుచుకుంటూ అడ‌విలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఇది నిజ‌మేనా.. లేక ఉత్తుత్తి వీడియోనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదేదో గ్రాఫిక్స్ లో యాడ్ చేసిన వీడియో కావ‌చ్చు అంటూ మరికొందరు నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.