బైక్ పై వెళుతున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

manza

చైనా మాంజా పక్షుల పాలిటే కాదు మనుషుల పాలిట కూడా ప్రాణ సంకటంగా మారింది. చైనా మాంజా ధాటికి బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.

ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాలలో చోటు చేసుకుంది. దంపతులు బైక్ పై వెళ్తుండగా.. గాలిపటానికి కట్టిన మాంజా వాహనం నడుపుతున్న వ్యక్తి మెడకు చుట్టుకుంది. బైక్ వేగంగా వెళ్తున్న కారణంగా.. బండి నడుపుతున్న వ్యక్తి గొంతు తీవ్రంగా కోసుకుపోయి తీవ్రంగా రక్తస్రావమైంది.

ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పండుగ పూట కళ్లెదుటే భర్త గొంతు తెగి చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికంగా అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.