మ్యాన్ హోల్స్, నాలాల నిర్మాణ పనుల దగ్గర ప్రమాదాలపై మున్సిపల్ శాఖ సీరియస్ - TNews Telugu

మ్యాన్ హోల్స్, నాలాల నిర్మాణ పనుల దగ్గర ప్రమాదాలపై మున్సిపల్ శాఖ సీరియస్DRF Teams Continues Rescue Operation for Missing Man in Manikonda
ఇటీవల మణికొండ దగ్గర నిర్మాణంలో ఉన్న నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

మ్యాన్ హోల్స్, నాలాల నిర్మాణ పనుల దగ్గర ప్రమాదాలపై మున్సిపల్ శాఖ సీరియస్ అయింది. ఇటీవల నాలాల్లో పడి పలువురు మృతి చెందిన వరుస ఘటనలతో మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏదైనా దుర్ఘటన జరిగితే కారకులపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. వర్క్ సైట్లలో రక్షణ చర్యలు తప్పనిసరి చేస్తూ మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. నగరంలో ఇటీవల మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ ఇద్దరు, వరదలకు నాలాల్లో పడి మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.

గ్రౌండ్ లెవల్ సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది.  వాటర్ సప్లై, శానిటైజేషన్, డ్రైనేజీ క్లీనింగ్, స్ట్రీట్ లైట్స్, ప్లై ఓవర్ల నిర్మాణం వంటి అన్ని రకాల వర్క్ సైట్లలో అంతిమ రక్షణ బాధ్యత మున్సిపల్ కమిషనర్లదే అని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.