ముషంపల్లి సంఘటన బాధాకరం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సునీతా లక్ష్మారెడ్డి - TNews Telugu

ముషంపల్లి సంఘటన బాధాకరం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సునీతా లక్ష్మారెడ్డి



ముషంపల్లి లో జరిగిన సంఘటన బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసానిచ్చారు.

గురువారం సాయంత్రం ముషంపల్లి కి చేరుకున్న ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దుండగులు శిక్ష నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆమె స్పష్టం చేశారు.

ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం బలమైన సాక్ష్యాధారాలు సేకరించిందని ఆమె వెల్లడించారు. గ్రామంలో బెల్ట్ షాప్ లపై చర్యలు చేప్పట్టే లా చర్యలు తీసుకుంటామని ఆమె గ్రామస్థులకు భరోసా ఇచ్చారు.