ధోనీని గుర్తు చేసిన పంత్‌.. చిర్రెత్తిపోయిన కోహ్లి.. వీడియో వైర‌ల్

టీ20 ప్రపంచకప్ రేపటి(అక్టోబర్‌ 17) నుంచి షురూ కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ వీడియోను త‌న ట్వీటర్ అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ల మధ్య వీడియో కాల్ సంభాషణ సరదా జరుగుతుంది.

తొలుత కోహ్లి పంత్‌ను ఉద్దేశిస్తూ.. టీ20ల్లో సిక్సర్లే మ్యాచ్‌లను గెలిపిస్తాయని అంటాడు. అందుకు పంత్‌ స్పందిస్తూ.. నువ్వేం కంగారుపడకు భయ్యా, నేను రోజు ప్రాక్టీస్‌ చేస్తున్నా.. అని అంటాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్‌ షాట్‌ను ఉద్దేశిస్తూ.. ఇంతకుముందు కూడా వికెట్‌ కీపర్‌గా ఉన్న వ్యక్తే సిక్సర్‌ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ అందించాడు అని బదులిస్తాడు.

ఇందుకు కోహ్లి రిప్లై ఇస్తూ.. నిజమే కానీ, ధోని భాయ్‌ తర్వాత అంతటి వికెట్‌కీపర్‌ భారత్‌కు ఇంకా దొరకలేదని సెటైర్ వేశాడు. అందుకు పంత్‌.. నేనూ టీమిండియా కీపర్‌నే కదా అన‌గానే.. చిర్రెత్తిపోయిన కోహ్లి.. చూడు పంత్‌.. నువ్వు కాకపోతే చాలా మంది వికెట్‌కీపర్లున్నారంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు ఊరుకుంటారా.. వారు సెటైర్లు వేశారు. టీంకు క‌ప్ అందియ్య‌డం గురించి మీరిద్దరే మాట్లాడుకోవాలి అంటూ సెట‌ర్లు వేస్తున్నారు.