తప్పతాగిన బార్ లోనే.. రూ.40 కోట్లు వసూలు చేసిన ఘనుడు.. లబోదిబోమంటున్న బార్ యాజమాన్యం - TNews Telugu

తప్పతాగిన బార్ లోనే.. రూ.40 కోట్లు వసూలు చేసిన ఘనుడు.. లబోదిబోమంటున్న బార్ యాజమాన్యంబారుకెళ్లాడు. కావాల్సినంత తాగాడు. కండ్లు మాత్రమే కాదు.. బార్, టేబుల్స్, కుర్చీలు, తన చుట్టూ ఉన్న మనుషులు అంతా గిర్రున తిరిగేలా తాగాడు. అదే ఊపుతో పార్కింగ్ లో ఉన్న కారు దగ్గరికి వచ్చాడు. కార్లన్నీ గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. అప్పుడర్థమైంది అతడికి భూమి గుండ్రంగా తిరగడం అంటే ఏందో. తన కారు అనుకొని మరో వ్యక్తి కారు స్టార్ట్ చేయబోయాడు. ఆ కారు ఓనర్ కూడా మద్యం మత్తులోనే ఉన్నాడు. ఇద్దరికీ గొడవ జరిగింది. గల్లా పట్టుకొని కొట్టుకున్నారు. ఈ గొడవలో మొదటి వ్యక్తి తలకు గాయమైంది. అంతే.. రెస్టారెంట్ మీద కేసు పెట్టి రూ.40 కోట్లు నష్ట పరిహారం రాబట్టాడు. చదువుతుంటే వింతగా అనిపించే ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

The person who mistakenly collected crores of rupees in compensation from the bar
The person who mistakenly collected crores of rupees in compensation from the bar

ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. దాదాపు మూడేండ్ల కిందటి ముచ్చట. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 2019 మే నెలలో టెక్సాస్ లో ఉండే డానియల్ రాల్స్ అనే వ్యక్తి ఆండ్రూస్ లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ లో ఫుల్లుగా తాగాడు. తాగిన మత్తులో పార్కింగులో ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో డానియల్ తలకు తీవ్ర గాయమైంది. నేరుగా వెళ్లి ఆస్పత్రిలో చేరాడు. తాగింది దిగిన తర్వాత కోర్టుకు వెళ్లి బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు వేశాడు. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన తలకు గాయమైందని ఆరోపించాడు. రెస్టారెంట్ సిబ్బంది తనకు అధిక మొత్తంలో తాగించి.. గొడవకు దిగారని.. తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని పిటిషన్ లో పేర్కొన్నాడు. గొడవ పడుతున్న సమయంలో రెస్టారెంట్ యాజమాన్యం స్పందించలేదని.. తాను గాయాలతో బాధపడుతుంటే కనీసం అంబులెన్స్ కు కూడా ఫోన్ చేయలేదని ఆరోపించాడు.

The person who mistakenly collected crores of rupees in compensation from the bar
The person who mistakenly collected crores of rupees in compensation from the bar

డానియల్ చర్యకు ఖంగు తిన్న రెస్టారెంట్ యాజమాన్యం తాను ఓ పిటిషన్ వేసింది. రెస్టారెంట్ తాలూకు న్యాయవాది ఎంత వాదించిన కోర్టు మాత్రం డానియల్ కే సపోర్ట్ చేసింది. బార్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక పౌరుడి ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉండేదని భావించింది. అందుకు గానూ.. అతడికి 5 మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో.. బాధితుడికి కోర్టు ఆదేశించిన మొత్తం చెల్లించక తప్పలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డానియల్ లక్ష్మీ పుత్రుడు.. అదృష్టం తన గ్లాసులో వైన్ లా మారింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.