ఆ బ్లడ్ గ్రూపోళ్లకు ‘కరోనా’ ముప్పు అధికం

carona-virus-testing

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. కరోనా ముప్పుపై ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

ఏ, బీ, ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఢిల్లీలోని సర్ గంగారామ్‌ హాస్పిటల్‌ పరిశోధకులు తేల్చారు.

blood-groups

ఇదే సమయంలో ఓ, ఏబీ, ఆర్‌హెచ్‌ నెగిటివ్‌ గ్రూపుల బ్లడ్‌ గ్రూపు ఉన్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.

ఒకే రకం బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల కంటే అదే బ్లడ్ గ్రూప్ ఉన్న పురుషులకే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.

మొత్తం 2,586 మంది కరోనా పేషెంట్లపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.