మావోలతో ప్రాణాపాయం ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్

High Court

మావోయిస్టులతో తనకు ప్రాణాపాయం ఉందని.. రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించాడు ఓ సర్పంచ్. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసనగండ్ల గ్రామ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరాడు. ఇటీవల మావోయిస్టు కార్యదర్శి జగన్ పేరుతో లక్ష్మా రెడ్డికి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. రూ.20 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని ఆ లేఖలో పేర్కొన్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. లక్ష్మారెడ్డికి పోలీస్ భద్రత కల్పించాల్సిందిగా సిద్దిపేట కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.