సుప్రీంకోర్టులో ఈసీకి చుక్కెదురు

Supreme Court

కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ‌ కొట్టివేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఈసీనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన తీవ్ర‌ వ్యాఖ్యలపై ఎన్నిక‌ల సంఘం సుప్రీంను ఆశ్ర‌యించింది.

ఈసీ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు.. కోర్టులో వాదనలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించలేమని స్పష్టం చేసింది. అదే విధంగా కీలక కేసుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని మద్రాస్‌ హైకోర్టుకు సూచించింది.

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ఎన్నికల కమిషన్‌యే కారణమని, ఈసీపై హత్య కేసు పెట్టాలని ఇటీవ‌ల మద్రాస్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. అయితే మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసింది.