39 సార్లు ట్యాక్సిలా అంబులెన్స్ ను వాడేశిండు.. వీడు మామూలోడు కాదు

The taiwan man used ambulance 39 times as a taxi

ఎమర్జెన్సీ ప‌రిస్థితుల్లోనే వినియోగించాల్సి అంబులెన్స్ స‌ర్వీసుల‌ను ఓ వ్యక్తి తన స్వార్థం కోసం వాడుకున్నాడు. ఒకటి, రెడు సార్లు కాదు.. ఏకంగా 39 సార్లు వినియోగించుకొని వార్తల్లో నిలిచాడు.

తైవాన్‌కు చెందిన ఓ వ్య‌క్తి నడవడం బద్ధకమేసి అంబులెన్స్ ను వాడేవాడు. అదే సమయంలో టాక్సీలకు పైసలు ఎందుకు కట్టాలనుకొని కొన్నిసార్లి ఇలా ఏదో ఒక కారణంతో అంబులెన్స్ సర్వీసును వాడేవాడు. సూపర్ మార్కెట్ కు వెళ్లిన ప్రతి సందర్భంలో అంబులెన్స్ కు ఫోన్ చేసి త‌న‌కు అస్వ‌స్థ‌త‌గా ఉంద‌ని చెప్పడం.. తను చెప్పిన ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని కోరేవాడు.

అత‌ను చెప్పిన ఆసుప‌త్రి ప‌క్క‌నే అత‌డి ఇల్లు ఉందట.  అంబులెన్స్ సిబ్బంది అతగాడిని ఆసుప‌త్రిలో దింప‌గానే అక్క‌డి నుంచి ఎంచక్కా రెండు అడుగులు లేసి త‌న ఇంటికి వెళ్లిపోయేవాడు.

అసలు ఇక్కడ గమ్మతైన విష‌యం ఏంటంటే.. సూప‌ర్ మార్కెట్ నుంచి సదరు వ్యక్తి ఇంటికి మ‌ధ్య ఉన్న కేవ‌లం 200 మీట‌ర్లు మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే క‌నీసం అర కిలోమీట‌ర్ కూడా కాదు. అయినా సదరు వ్యక్తి నడవడానికి బద్ధకమేసి ఫ్రీ ట్యాక్సీలా అంబులెన్స్ ను 39 సార్లు వాడుకున్నాడు.

కానీ ఓ రోజు తన అసలు రంగును ఆస్పత్రి సిబ్బంది బయటపెట్టారు. అంబులెన్స్ లో వ‌చ్చి చెక‌ప్ చేయించుకోకుండా వెళ్లిపోతున్న అత‌డిపై హాస్పిట‌ల్ సిబ్బందికి అనుమానం వచ్చి  పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వాళ్లు వచ్చి అత‌డి అస‌లు గుట్టును బ‌య‌ట‌పెట్టారు.

అతడు చేసిన పనికి జైలులో వేయాల్సింది కానీ, ఈ తరహా సంఘటన ఇదే తొలిసారి కావడంతో అత‌డికి వార్నింగ్ ఇచ్చి వ‌దిలేశారు. మరోసారి అలా చేస్తే కేసు పెట్టి జైలుకు పంపుతామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.