ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్‌..! - TNews Telugu

ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్‌..!The Theme Song Of Rajamouli's RRR Movie Will Be Out On 1st August  https://www.thehansindia.com/cinema/tollywood/the-theme-song-of-rajamoulis-rrr-movie-will-be-out-on-1st-august-698282
The Theme Song Of Rajamouli’s RRR Movie Will Be Out On 1st August

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ RRR. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరెకక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఒక పాట మినహా టాకీ పార్ట్ పూర్తైయింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టింది. తెలుగు వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండగా.. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

అయితే షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వటంతో ప్రమోషన్స్ లో బిజీ అయిపోయిది RRR టీమ్. ఈ నేపథ్యంలో RRR సినిమాకి సంబదించిన థీమ్ సాంగ్ ని రెడీ చేసారు ఎం.ఎం.కీరవాణి. ఈ థీమ్ సాంగ్ ని ఒక్కో భాషలో ఒక్కొక్క సింగర్ తో పాడిస్తున్నారట. తమిళ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పాడటం జరిగింది. ఇక అనిరుథ్ మ్యూజిక్‌ నుండే RRR మూవీకి మరో ప్రమోషనల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వివిధ గాయకులూ వివిధ భాషల్లో పాడిన ‘ఆర్ఆర్ఆర్’ థీమ్ సాంగ్ ని ఆగష్టు 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు.

ఆయా భాషల్లో ఈ పాటను అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆలపించారు. ఈ పాట స్నేహం విలువని చాటిచెబుతూనే..మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్యారేక్టరైజేషన్స్ చెప్పేలా ఉంటుందని అంటున్నారు. అందుకే RRR స్టోరీకి కీలకమైన ఈ థీమ్ సాంగ్ ని ఎంతో ప్రత్రిష్టాత్మకంగా తీసుకున్న RRR టీమ్… ఈ సాంగ్ ని ప్రమోషనల్ ఈవెంట్స్ లోను వాడుకునేలా చూసుకుంటుంది.